ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డికి నోటీసులు

ఓటుకు నోటు కేసులో విచారణ స్పీడప్ చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని విచారించింది. తాజాగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. అయితే మూడున్నరేళ్ల తర్వాత మళ్లీ ఈడీ ఎందుకు విచారిస్తుందో అర్ధం కావటం లేదన్నారు నరేందర్ రెడ్డి. కేసును రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర సర్కార్ కు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. తన పిల్లల్ని కూడా విచారణకు పిలిచి వేధిస్తున్నారని మండిపడ్డారు.

Latest Updates