శిలలపై కేసీఆర్ చిత్రాలా? పిచ్చి పరాకాష్టకు చేరింది: రేవంత్

యాదాద్రి ఆలయ స్థంభాలపై సీఎం కేసీఆర్ బొమ్మ చెక్కడంపై దుమారం రేగుతోంది. ఆలయాల్లో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తులు చెక్కడం దుర్మార్గమన్నారు పీసీీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ పవిత్రమైన ఆలయాల్లో రాజకీయాలకు చోటు లేదన్నారు. చరిత్రలో ఏ ఆలయాల్లో ఎక్కడా పాలకుల చిత్రాలు చెక్కలేదన్నారు. ప్రభుత్వ అధికారుల పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లిందన్నారు. వ్యక్తి పూజల  కోసం వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వెంటనే వాటిని తొలగించాలని అన్నారు.

Latest Updates