ఇండియాకు హెల్ప్‌ చేసేందుకు అమెరికా బలగాలు

  • చైనాకు చెక్‌ పెట్టేందుకే
  • ప్రకటించిన మైక్‌ పాంపియో

వాషింగ్టన్‌: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా మరోసారి స్పందించింది. చైనా నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ సైన్యాన్ని మనకు మద్దతుగా పంపిస్తానని విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు. జర్మనీలో ఉన్న అమెరికా బలగాలను ఇక్కడకు పంపిసతున్నట్లు సూచనా ప్రాయంగా చెప్పారు. జర్మనీలో బలగాలను ఎందుకు తగ్గిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. భారత్‌, దక్షిణాసియాకు చైనా ముప్పుడా మారిందని అన్నారు. గురువారం బ్రసెల్స్‌ ఫోరం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పాంపియో ఈ విషయాలు చెప్పారు. చైనా భారత్‌ను బెదిరిస్తోందని, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పైన్స్‌, దేశాలకు ముప్పుగా మారిందని అభిప్రాయపడ్డారు. సముద్ర మార్గంలో కూడా చైనా సవాళ్లు విసురుతోందని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులన్నింటనీ వినియోగిస్తాం అని పాంపియో అన్నారు. పరిస్థితిని బట్టి ఎయిర్‌‌ఫోర్స్‌, మెరైన్‌ సోల్జర్స్‌, నిఘా దళాలు అవసరమైన ప్రాంతాలకు కేటాయించాల్సి ఉంటుందని పాంపియో చెప్పారు.

Latest Updates