2028 నాటికి హైబ్రిడ్ గుండె

  • సింథటిక్ మెటీరియల్, మనిషి బాడీ సెల్స్​తో తయారీ
  • మూడేళ్లలో జంతువులలో టెస్ట్.. ఎనిమిదేళ్లలో మనుషులకు
  • ‘బిగ్ బీట్ చాలెంజ్’లో పోటీపడుతున్న మరో 3 ‘హార్ట్’ ప్రాజెక్టులు

డోనర్ల నుంచి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే గుండె దొరికితేనే గుండె ఫెయిలైన పేషెంట్లకు మార్పిడి చేసి  బతికించేందుకు చాన్స్ ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ గుండెతోనూ కొందరిని కొన్నేళ్లపాటు ప్రాణం నిలబెట్టేందుకు అవకాశం ఉంది. అయితే అటు పూర్తి ఆర్టిఫిషియల్ కాకుండా.. ఇటు పూర్తి నేచురల్ కాకుండా.. రెండింటికీ మధ్యస్తంగా ఉండే ‘హైబ్రిడ్ గుండె’ ఫ్యూచర్ లో గుండె మార్పిడి అవసరమున్న పేషంట్లకు ఒక వరంలా మారనుందని సైంటిస్టులు చెప్తున్నారు. సింథటిక్ మెటీరియల్​తో కండరాలను, హ్యూమన్ బాడీ సెల్స్ తో టిష్యూస్ ను తయారు చేసి, వాటితో సాఫ్ట్ రోబోటిక్ హార్ట్ (హైబ్రిడ్) హార్ట్ ను తయారు చేశారు నెదర్లాండ్స్, కేంబ్రిడ్జ్, లండన్ సైంటిస్టులు. గుండె జబ్బులకు ట్రీట్ మెంట్ విధానాన్ని సమూలంగా మార్చివేయడం కోసం బ్రిటిష్​హార్ట్ ఫౌండేషన్(బీహెచ్ఎఫ్) ప్రకటించిన ‘బిగ్ బీట్ చాలెంజ్’లో పోటీలో భాగంగా ఈ డివైస్ ను రూపొందిస్తున్నారు.

గుండెపై 4 కీలక ప్రాజెక్టులు..

‘బిగ్ బీట్ చాలెంజ్’లో భాగంగా బీహెచ్ఎఫ్​ప్రకటించిన పోటీలో 40 దేశాల నుంచి 75 అప్లికేషన్లు వచ్చాయి. వాటిలోంచి ఫైనల్ గా నాలుగు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వీటికి రూ. 46 లక్షలను సీడ్ ఫండింగ్ కింద ఇచ్చారు. తర్వాత ఆరు నెలలపాటు వీరు తమ ప్రాజెక్టులను మరింత డెవలప్ చేయాలి. అప్పుడు ఫైనల్ విన్నర్ ను రూ. 280 కోట్ల మెయిన్ ప్రైజ్ కోసం ఎంపిక చేస్తారు. ప్రస్తుతం సెలెక్ట్ అయిన నాలుగు ప్రాజెక్టులలో హైబ్రిడ్ హార్ట్ ప్రాజెక్టుతో పాటు గుండెజబ్బుకు పవర్ ఫుల్ టీకా, గుండె లోపాలకు జెనెటిక్ ట్రీట్ మెంట్, హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్​ను ముందే గుర్తించే వేరబుల్ టెక్నాలజీ రూపకల్పన వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.

 హైబ్రిడ్ హార్ట్ పై భారీ ఆశలు..

హైబ్రిడ్ హార్ట్ ప్రాజెక్టును నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డ్యాం యూనివర్సిటీ సైంటిస్టులు లీడ్ చేస్తున్నారు. సింథటిక్ మెటీరియల్ తో గుండె వాల్వ్ లు, కండరాలు తయారు చేయడం, అవి నిజమైన వాల్వ్ లు, కండరాల మాదిరిగానే బ్లడ్ ను పంప్ చేసేలా చూడటం ఈ ప్రాజెక్టులో కీలకం. సాఫ్ట్ గా ఉంటూనే, చాలా దృఢంగా ఉండే సింథటిక్ లేయర్లను ఇందుకోసం వాడుతున్నారు. అలాగే ఈ సింథటిక్ రోబోటిక్ గుండెను పేషెంట్ల శరీరం తిరస్కరించకుండా ఉండేందుకోసం, వారి శరీరం నుంచి సేకరించిన కణాలతోనే ఈ గుండె చుట్టూ టిష్యూగా పెరిగేలా చేయనున్నారు. దీంతో ఈ గుండెను పేషెంట్ శరీరం తిరస్కరించదని చెప్తున్నారు. ఈ హైబ్రిడ్ హార్ట్ ప్రొటోటైప్ ను మూడేళ్లలో జంతువుల్లో టెస్ట్ చేయనున్నట్లు ప్రాజెక్ట్ సైంటిస్టులు వెల్లడించారు. పూర్తిస్థాయి రీసెర్చ్ తర్వాత 2028 నాటికి దీనిని మనుషుల్లో అమర్చి టెస్ట్ చేస్తామని అంటున్నారు.

 

Latest Updates