లోక్‌సభకు చేరిన రేవంత్ వ్యవహారం

రేవంత్​పై కక్ష సాధిస్తున్నరు

రాష్ట్ర సర్కార్​ బెయిల్​ రాకుండా చేస్తున్నది

లోక్​సభలో కాంగ్రెస్​ ఫైర్​

కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాలని వినతి

అరెస్టు అంశంపై  సభలో నోటీసుల

చర్చకు అవకాశం ఇచ్చిన స్పీకర్​

న్యూఢిల్లీ, వెలుగు: మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్‌ అంశం పార్లమెంట్‌ను తాకింది. తెలంగాణ ప్రభుత్వం ఆయనపై కక్షసాధిస్తున్నదని, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని, బెయిల్​ కూడా రాకుండా చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. వెంటనే కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్​ చేసింది. రేవంత్​ అరెస్టు అంశంపై గురువారం లోక్ సభలో తమిళనాడు ఎంపీలు  మణికమ్​ ఠాగూర్​, సుబ్బరామన్​ తిరునవుక్కరసర్,  పంజాబ్​ ఎంపీ జబ్బీర్​సింగ్​ గిల్​ నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ లోక్‌ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరీ వాయిదా తీర్మానం అందజేశారు. క్వశన్ అవర్ ముగిసిన అనంతరం మణికమ్​ నోటీస్​పై స్పీకర్ ఓం ప్రకాశ్​ బిర్లా స్వల్ప చర్చకు అవకాశం ఇచ్చారు.

అది ప్రతీకార చర్యే: మణికమ్​

ఎంపీ రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేసిందని తమిళనాడు కాంగ్రెస్​ ఎంపీ మణికమ్ ఠాగూర్ మండిపడ్డారు. రాష్ట్ర మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ( కేటీఆర్) 28 ఎకరాల్లో ఫాంహౌస్​ను అక్రమంగా నిర్మించారని, దీన్ని బయటికి తెచ్చినందుకు రాజకీయ ప్రతీకారంగా తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టిందని లోక్​సభలో ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి కలుగజేసుకొని, వాస్తవాలను సభకు తెలియజేయాలని ఆయన కోరారు. మణికమ్ ​వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీలు తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎంపీ  మణికమ్​ ఠాగూర్​ సభను పూర్తిగా పక్కదారి పట్టించారని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు ఆరోపించారు. రేవంత్ చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందుకే ఆయనను అరెస్ట్ చేసినట్లు లోక్​సభకు తెలిపారు.

స్పీకర్​కు ఎంపీ జ్యోతిమణి లేఖ

రేవంత్​రెడ్డి అరెస్టుపై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్​ మరో ఎంపీ జ్యోతిమణి లోక్​సభ స్పీకర్​కు లేఖ రాశారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్​ కుమారుడు, మంత్రి కేటీఆర్​ అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్​ విషయాన్ని బహిర్గతం చేసిన మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు బెయిల్ రాకుండా చేస్తోంది. రేవంత్​రెడ్డిది కేవలం రాజకీయ అరెస్టు. ఈ విషయంలో కలుగజేసుకోండి. ఆయన లోక్​సభకు హాజరయ్యేలా చూడండి’ అని లేఖలో ఆమె విజ్ఞప్తి చేశారు.

For More News..

మైక్రోసాఫ్ట్‌కు బిల్‌గేట్స్ రాజీనామా

కరెంట్ చార్జీలు పెరిగితే భరించాలే

Latest Updates