గూగుల్ పేతో లక్ష రూపాయల రివార్డు

అదృష్టం అనేది అందరికీ ఉండదు. కొందరికి కొన్ని సమయాల్లో కలిసివస్తుంది. అలాంటి అదృష్టమే గూగుల్ పే రూపంలో వరించింది ఓ వ్యక్తికి. ఫ్రెండ్ కు గూగుల్ పేతో మనీ పంపిస్తే.. ఆయనకు రివార్డు రూపంలో అదృష్టం వరించింది. లక్ష రూపాయలు వచ్చాయి.

అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్‌ తన ఫ్రెండ్ కు గూగుల్ పే యాప్ ద్వారా రూ.3 వేలను బదిలీ చేశాడు. నగదు బదిలీ అయిన కొద్ది సేపటికి సూర్యప్రకాశ్‌ బ్యాంకు ఖాతాకు రూ.1,00,107 జమ అయినట్టు గూగుల్‌ పే నుంచి మెసేజ్‌ వచ్చింది. ఊహించని విధంగా మనీ  రావడంతో సూర్యప్రకాశ్‌ సంతోషం వ్యక్తం చేశాడు.ఎన్నో సార్లు మనీ ట్రాన్స్ఫర్ చేసినా..ఇంత మొత్తంలో ఎప్పుడూ రాలేదని చెప్పాడు.ఇప్పడు ఏకంగా లక్ష రూపాయలు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

Latest Updates