నరరూప రాక్షసుల అరెస్ట్: ప్రాణాలకు తెగించి పట్టుకున్న పోలీసులకు రివార్డులు

నెల్లూరు జిల్లా : సినిమా స్టైల్లో ఘరానా దొంగలను పట్టుకున్నారు  ఏపీ పోలీసులు. మర్డర్, కిడ్నాప్, భారీ దొంగతనాలు చేయడం కేడీ రౌడీలకు వెన్నతో పెట్టిన విద్య. దొంగతనం చేసేటప్పుడు ఎవరైనా అడ్డు వస్తు అక్కడే చంపేసే నరరూప రాక్షసులు. అలాంటి భయంకరమైన దొంగలను ప్రాణాలకు తెగించి పక్కా స్కెచ్ తో శుక్రవారం మధ్యప్రదేశ్ లో పట్టుకున్నారు నెల్లూరు జిల్లా పోలీసులు.

వివరాలు:

మధ్యప్రదేశ్ కు చెందిన బుచ్చి అనే నరరూప హంతకుడు కొన్ని సంవత్సరాలుగా ముఠాను ఏర్పరుచుకున్నాడు. హైదరాబాద్, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో దోపిడీలు చేసేవాడు. ఎప్పటి నుంచే ఈ దొంగపై ఎంతో మంది పోలీసులు కన్నేశారు. ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ వేసి ఫేయిల్ అయ్యారు. అయితే శుక్రవారం పక్కా సమాచారంతో స్కెచ్ వేసిన నెల్లూరు పోలీసులు మధ్యప్రదేశ్ లో పట్టుకున్నారు. అతడి రూమ్ లో దొరికిన రూ. 25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. SP భాస్కర్ భూషణ్ ఆదేశాలతో ముమ్మరంగా గాలింపు చేపట్టడంతో.. భయపడిపోయిన నిందితుడు బుచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బుచ్చితో పాటు పలువురు దొంగలను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు.

ఖాకీ సినిమాను తలపించే రీతిలో పోలీసులు సురేష్ బాబు, అక్కేశ్వరరావు రిస్క్ ఆపరేషన్ చేశారని.. గతంలో వీరు ప్రాణాలకు తెగించి 6 మంది ఘరానా ముఠాను అరెస్టు చేశారని తెలిపారు SP.  మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి రాత్రింబవళ్లు శ్రమించి, ప్రాణాలకు తెగించి మరీ నరరూప రాక్షసులను అరెస్ట్  చేశారని చెప్పారు. మొత్తానికి ప్రధాన నిందితుడిని కూడా అరెస్ట్ చేయడంతో సిబ్బందికి రివార్డులు ప్రకటించినట్లు తెలిపారు SP భాస్కర్ భూషణ్.

Latest Updates