ఆర్‌ఎఫ్‌ఐడీ వస్తే ఆగాల్సిన పనిలేదు

ఆర్‌ఎఫ్‌ఐడీ వస్తే ఆగాల్సిన పనిలేదు 15 రోజుల్లో ఓఆర్‌ఆర్‌ ప్లాజాల వద్ద కొత్త పద్ధతి హైదరాబాద్‌,

వెలుగు: హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పై ప్రయాణం మరింత స్మార్ట్‌ కానుంది.15 రోజుల్లో ఆర్‌ఎఫ్‌ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటి ఫికేషన్‌ )ను ఓఆర్‌ఆర్‌ టోల్‌ ప్లాజాల వద్ద అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ పద్ధతి అమలులోకి వస్తే సమయం ఆదా అవుతుందని ఒక్క సెకను కూడా ఆగాల్సి న పని లేకుండా టోల్‌ మన ఎకౌంట్‌ నుం చే కట్‌ అవుతుందన్నారు. ఈ సాం కేతిక పద్ధతిని 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లోని 19 ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఉపయోగించనున్నట్లు తెలిపారు.ఇలా చేస్తారు ఐసీఐసీఐ Bank  సహాయంతో ఒక ఖాతా ఏర్పాటు చేసి బార్‌కోడింగ్‌ కలిగిన స్ట్రి క్కర్స్‌ ఇస్తారు. ఈ బార్‌కోడ్‌ను సెన్సార్‌ సిస్టమ్ కు అనుసంధానం చేస్తారు. స్ట్రిక్కర్‌ను వాహనం ముందు అద్దం పై అంటిస్తా రు. ఈ స్ట్రి క్కర్‌పై ఉన్న బార్‌కోడ్‌ను 40 మీటర్ల దూరంలోనే పసిగట్టి గేట్లు తెరుచుకుంటాయి. ఆన్ న్ లోనే మనీ కట్‌ అవుతుంది.

Latest Updates