
హైదరాబాద్: అమెజాన్ కంపెనీలో చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులను శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ. పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ సమీపంలోని అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ కంపెనీలో జరిగిన ఈ చోరీలో.. కంపెనీలోని ఉద్యోగులే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలిసింది. సోమవారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి నాలుగు లక్షల విలువ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా అమెజాన్ కంపెనీ ఉద్యోగులుగా పోలీసులు నిర్ధారించారు.