వైరల్ వీడియో: జింకను గన్‌తో కాల్చి.. కత్తితో గొంతు కోసిన వ్యక్తి

కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇది ఎక్కడ జరిగింది, ఎవరు చేశారనేది మాత్రం తెలియదు. కానీ, జింకను చంపడం మాత్రం నేరం.

ఆర్జీవీ పోస్టు చేసిన వీడియోలో ఒక వ్యక్తి జింకను వేటాడటం చూస్తే ఎవరికైనా కోపం రాక మానదు. తన ముందున్న జింకను మొదట గన్‌తో కాల్చి.. ఆ తర్వాత పదునైన కత్తితో ఆ జింక గొంతు కోశాడు. జింకను వేటాడని పోలీసులు, కోర్టులు సల్మాన్ ఖాన్‌ని విచారిస్తున్నారు కదా.. మరి ఈ వ్యక్తి క్రూరంగా జింకను చంపాడు. మరి ఇతన్ని ఏం చేస్తారు? అని ఆర్జీవీ చట్టాన్ని ప్రశ్నిస్తున్నాడు. దీనికి పోలీసులు, కోర్టులు సమాదానం చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. మన దేశంలో జింకను వేటాడటం చాలా పెద్ద నేరం. వాటిని వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ఇప్పటికీ కోర్టుల చుట్టు తిరుగుతూనే ఉన్నాడు.

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా 7,423 బాంబుల దాడి

43.5 కోట్ల మంది డేటా అమ్మేసుకున్న కంపెనీ

Latest Updates