వర్మకు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు

varma-fined-for-triple-riding

రామ్‌గోపాల్‌ వర్మకు ఫైన్ వేశారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్‌ శంకర్‌ ను చూసేందుకు మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు అజయ్‌ భూపతి, అగస్త్యతో కలిసి బైక్‌ పై వెళ్లాడు వర్మ. ట్రిపుల్‌ రైడింగ్‌ పైగా హెల్మెట్‌ లేకుండా బైక్‌ పై టిప్‌ టాప్‌గా బయల్దేరాడు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న విషయాన్ని వర్మ ముందుగానే సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చూసేందుకు హెల్మెట్‌ లేకుండా ట్రిపుల్‌ రైడింగ్‌ లో వెళుతున్నాం. ఇంతకీ పోలీస్‌ ఎక్కడ’’ అంటూ ట్వీట్ చేశాడు. బహుశా వాళ్లూ థియేటర్‌ లో ఉండి ఉంటారు అంటూ  వ్యంగ్యంగా ఓ కామెంట్‌ కూడా ట్విటర్‌ లో పోస్ట్‌ చేశాడు.

మరి ‘మేం ఏమైనా తక్కువ తిన్నామా’ అంటూ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ వేశారు. ట్రిపుల్‌ రైడింగ్‌కు రూ.1200, హెల్మెట్‌ లేని ప్రయాణానికి రూ.100తో పాటు యూజర్‌ ఛార్జీలతో కలిపి మొత్తం రూ.1335 ఫైన్ వేశారు. రామ్‌ గోపాల్‌ వర్మ పోస్ట్‌ చేసిన సినిమాకు ఈ-చలానా వెబ్‌ సైట్‌ లో పెట్టి వర్మ స్టైల్లో ఫైన్ వేశారు పోలీసులు. ట్రిపుల్ రైడింగ్ లో వచ్చిన ఈ బైక్‌ దిలీప్‌ కుమార్‌ పేరిట ఉందని గుర్తించిన పోలీసులు ఫైన్ వేశారు.

RGV bike got fine for triple riding while going to ismart shankar movie

Latest Updates