ట్రోల్ అవుతున్న వర్మ ‘ఏప్రిల్ పూల్’ ట్వీట్

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ ఎలా  రాబట్టుకోవాలో వర్మకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు.  రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ శుక్రవారం రిలీజ్ అవుతుంది. ప్రచారం కోసం వర్మ   రెండు ఆసక్తికర ట్వీట్లు చేశారు.  అయితే వర్మ ట్వీట్లు  తన సినిమాకు  ప్రచారం కల్పించకపోగా.. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.  వర్మ ట్వీట్లను  నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం వర్మకు ఇలాంటి ట్వీట్లు మామూలేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘నేను భీమవరం నుంచి పోటీ చేస్తున్నాను. నామినేషన్ గడువు ముగిసినా ఉన్నతాధికారుల నుంచి నాకు పర్మిషన్ వచ్చింది. పూర్తి వివరాలు వెల్లడిస్తా వేచి చూడండి ‘అని ట్వీట్  చేశారు. ఈ ట్వీట్లు చూసిన వారంతా వర్మ రాజకీయాల్లోకి వస్తున్నారా ఏంటి ? అని చర్చించుకోవడం మొదలు పెట్టారు. మళ్లీ కాసేపటికే వర్మ మరో ట్వీట్ తో అందరినీ కూల్ చేశారు. ‘తాను భీమవరంలో పోటీ చేస్తానన్నది అడ్వాన్స్  ఏప్రిల్ ఫూల్ జోక్ కోసమే. నా ట్వీట్ నమ్మేంత అమాయకులు ఉండరు‘ అంటూ ట్వీట్ చేశారు.

Latest Updates