ఆర్జీవీ మరో యాంగిల్.. బ్యూటీలతో స్టెప్పులు

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ఈసారి తన స్టైల్ మార్చి మరో రకంగా హైలెట్ అయ్యాడు. ఓ  సినిమా ఈవెంట్ లో  డాన్స్ స్టెప్పులతో అదరగొట్టాడు. బ్యూటిఫుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో  పాల్గొన్న ఆయన….అందమైన అమ్మాయిలతో కలసి కాలు కదిపాడు. మొదట డ్యాన్సర్ తో కలిసి స్టేజీ ముందు స్టెప్పులేసిన వర్మ.. తర్వాత హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి స్టేజ్ పైనా డాన్స్ చేశాడు. ఆయన డాన్స్ చూసిన అభిమానులు.. వర్మ ఏం చేసినా సంచలనమేనంటున్నారు.

Latest Updates