ప‌వ‌న్ క‌ల్యాణ్ ను సీఎంగా చూడాలని ఉంది : ఆర్జీవీ

దర్శకుడు రాం గోపాల్ వర్మ ఇంటిపై దాడికి పాల్పడిన కేసులో ఏడుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ ప‌నిపాటాలేని వాళ్లు దాడికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు.

1. మీరు ప‌వ‌ర్ స్టార్ సినిమా తీస్తే, మీ పై ప‌రాన్న‌జీవి సినిమా తెర‌కెక్కుతుంది ఆ సినిమా చూస్తారా అన్న
మీడియా ప్ర‌శ్న‌ల‌కు

నాకు మ‌రో సినిమా చూసేంత స‌మ‌యం లేద‌న్నారు. ప్ర‌స్తుతం తాను ప‌వ‌ర్ స్టార్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్న‌ట్లు చెప్పారు.

2. చంద్ర‌బాబు, సీఎం జ‌గ‌న్ , ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌ను టార్గెట్ చే‌శారు. తరువాత ఎవ‌రిని టార్గెట్ చేస్తూ సినిమా తీస్తారు..?

తానెవ‌రిని టార్గెట్ చేయ‌డం లేద‌ని, ఫిక్ష‌న‌ల్ క్యార‌క్ట‌ర్ ను డిజైన్ చేసుకొని సినిమాను డైరక్టె చేస్తా త‌ప్పితే తాను ఎవ‌రిని టార్గెట్ చేయ‌డం లేద‌న్నారు

3. ప‌వన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ ప‌వ‌ర్ స్టార్ సినిమా తీశారా..?

అది నా ఇష్టం. మ‌న‌ది డెమోక్ర‌టిక్ కంట్రీ. ఎవ‌రైనా సినిమాలు చేయోచ్చు. మీరు సినిమాలు తీసుకోవ‌చ్చ‌ని మీడియాకు చెప్పారు.

4. చాతుర్మాస దీక్ష‌లో ఉన్న ప‌వ‌న్ ఈ సినిమా, ఇన్సిడెంట్ గురించి ప‌ట్టించుకుంటారా..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇవ‌న్నీ ప‌ట్టించుకోరు. నేనూ ప‌ట్టించుకోను. ప‌నిపాట లేని వాళ్లు ఇలాంటివ‌న్నీ ప‌ట్టించుకుంటార‌న్న ఆర్జీవీ..బిజీగా ఉన్న‌వాళ్లు త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళతార‌ని చెప్పారు.

5. ప‌వ‌న్ ఓట‌మి గురించి మీరేమంటారు..?

ప్ర‌తీఒక్క‌రి జీవితంలో జ‌యాప‌జ‌యాలు కామ‌న్. ఇవ్వాళ ఫెయిల్ అవ్వొచ్చు. రేపు విజ‌యం సాధించ‌వ‌చ్చు.

6. ప‌వ‌న్ క‌ల్యాణ రాజ‌కీయం గురించి స్పందిస్తారా..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని ఉంది. ఆయ‌న చూడ‌డానికి బాగుంటారు. మీటింగ్ ల‌లో ఉద్వేగ‌మైన స్పీచ్ ఇస్తార‌ని ఆర్జీవీ త‌న‌దైన స్టైల్లో స్పందించారు.

Latest Updates