దిశ ఘటనపై ఆర్జీవీ మూవీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఈ విషయాన్ని శనివారం తన ట్విటర్ లో తెలిపాడు . ఈ సినిమాలో భయంకరమైన నిజాలు చెప్పబోతున్నానని వర్మ వెల్లడించాడు.

‘దిశ అత్యాచారం, హత్య ఘటనల ఆధారంగా సినిమా చేయబోతున్నాను. ఆ సినిమాకు ‘దిశ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశాం. ‘నిర్భయ’ అత్యాచారం తర్వాత అంతకంటే దారుణంగా ఓ ఆడపిల్లలను రేప్ చేసి సజీవదహనం చేశారు. దిశ ఘటన తర్వాత రేపిస్టులు ఏం నేర్చుకోలేదదు, వారి ఆగడాలు ఏ మాత్రం ఆగలేదు. ఆలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో ఈ సినిమాలో చూపిస్తా, ప్రతీ విషయం క్షుణ్ణంగా చెబుతా”అని తన ట్విటర్ లో పేర్కొన్నాడు.

‘నిర్భయను అత్యాచారం చేసి రోడ్డు మీద వదిలివెళ్లారు. అలా చేస్తే శిక్ష పడదు అనుకున్నారు. కానీ పోలీసులకు చిక్కారు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదని దిశను ఆ దోషులు కాల్చి చంపారు. నిర్భయ దోషులను ఈ రోజు ఉరి వేయాల్సింది. కానీ ఆ నిందితుల తరఫు (రాక్షస)న్యాయవాది ఏపీ సింగ్‌ పిటిషన్‌ వేసి ఉరిశిక్ష వాయిదా పడేలా చేశారు.. ‘దిశ’ లో నిందితులకు వేసే శిక్ష నా స్టైల్‌లో ఉంటుంది’ అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశాడు.

Latest Updates