టైగర్ KCR : బయోపిక్ ప్రకటించిన వర్మ

  • అగ్రెసివ్ గాంధీ KCR అనేది ట్యాగ్ లైన్

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ తీసేందుకు రెడీ అయ్యారు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసిన వర్మ… తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ ను.. “టైగర్ కేసీఆర్” పేరుతో తీయబోతున్నట్టు ప్రకటించారు. ట్విట్టర్ లో మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

పోస్టర్ లో టైగర్ కేసీఆర్ అని  ఉంది.  అగ్రెసివ్ గాంధీ, ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు‘ అని క్యాప్షన్స్ ఉన్నాయి.  “తెలంగాణ ప్రజలకు.. ఆంధ్రావాళ్లు థర్డ్ క్లాస్ ట్రీట్ మెంట్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో దానిని కేసీఆర్ ఎలా జీర్ణించుకోలేకపోయారు… తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు తీవ్రమైన ఉద్యమాన్ని ఎలా నడిపారు.. అనే అంశాలను ఆధారంగా చేసుకుని KTR తండ్రి KCR బయోపిక్ తీస్తున్నా” అని వర్మ ట్వీట్ చేశారు.

కేసీఆర్ ను ఆడు అని ఎందుకన్నానంటే… 

తన ట్వీట్ లో KCRను ఆడు అని అన్నందుకు కొందరు అభ్యంతరం చెప్పారు. తెలంగాణ సాధకుడు, ముఖ్యమంత్రిని ఆడు అని ఎలా అంటారని వర్మను నిలదీశారు కొందరు నెటిజన్లు. దీనికి RGV వివరణ ఇచ్చారు. ఆడు అనేది తన ఉద్దేశం కాదనీ… తెలంగాణ సాధించడానికి ముందు.. పోరాటం చేస్తున్నప్పుడు KCR అంటే కొందరికి చిన్నచూపు ఉండేదని.. అందుకే ఆ పదం వాడినట్టు క్లారిఫికేషన్ ఇచ్చారు వర్మ.

Latest Updates