పాకిస్థాన్ ప్రధానిపై ఆర్జీవీ విమర్శల బాంబులు

సెటైర్ కింగ్, పంచ్ మాస్టర్, విమర్శల కేరాఫ్..  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఇచ్చిన చర్చల పిలుపును తనదైన స్టైల్ లో సెటైరికల్ గా చెడుగుడు ఆడేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై సీరియస్ అయ్యారు. ప్రియమైన, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. మాటలతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు నమ్మినప్పుడు….మూడుసార్లు వివాహాలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలంటూ సెటైర్ వేశారు రాంగోపాల్ వర్మ.

ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్డీఎక్స్ తో మా వైపు పరిగెత్తుకొస్తున్నపుడు అతనితో ఎలా చర్చలు జరపాలో ఇండియన్స్ కి కొంచెం చెప్పాలంటూ ట్వీట్ చేశాడు. ఊరికే ఏమీ వద్దు. భారతీయులందరం మీకు, మీ ట్యూషన్  టీచర్ కు ఫీజు చెల్లిస్తామంటూ సెటైర్ వేశారు. మీ దేశంలో ఉగ్రవాదులు నివసిస్తున్నారనేది అమెరికాకు తెలుస్తుంది. కానీ మీకు తెలియదు. అసలు మీది నిజంగానే ఓ దేశమేనా ? అని ప్రశ్నించాడు. దయచేసి నన్ను కొంచెం ఎడ్యుకేట్ చేయండి అన్నారు.

“ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదా మీ ప్లే స్టేషన్లు అని నాకు ఎవరూ చెప్పలేదు. కానీ మీరు కూడా వాటిపై ప్రేమ లేదనే విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఉగ్రవాద సంస్థలను మీరు బంతులుగా భావించి.., పాకిస్తాన్ బౌండరీలు దాటిస్తూ భారత పెవిలియన్లోకి కొడుతున్నారు. కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా లేక బాంబులు అనుకుంటున్నారో కాస్త చెప్పాలి” అంటూ ట్వీట్ చేశాడు. దయచేసి మాకు తెలివి తేటలు నేర్పించండి సర్ అంటూ సెటైర్ వేశారు. రామ్ గోపాల్  వర్మ ఇంగ్లీష్ లో చేసిన ట్వీట్ ను రచయిత కోన వెంకట్  తెలుగులో ట్రాన్స్ లేట్ చేస్తూ రీట్వీట్  చేశారు.

https://twitter.com/konavenkat99/status/1098294923080548352

Latest Updates