పవన్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పై వర్మ సెటైర్లు

పవన్‌ కళ్యాణ్‌ ని వెండితెర మీద మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దా మాఅని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘పింక్‌ ’ రీమేక్ చేస్తున్నాడని తెలిసినా.. అందులో ఆయన ఎలా ఉంటాడు,ఏ గెటప్‌ లో కనిపిస్తాడు, సినిమాకి ఏం టైటిల్‌ పెడతారుఅంటూ రకరకాల ప్రశ్నలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి.వాటన్నిం టికీ ఒకేసారి జవాబు చెప్పేశాడు పీకే. ‘వకీల్‌సాబ్‌ ’గా వస్తున్నానంటూ శుభవార్త చెప్పాడు. టైటిల్‌ తోపాటు తన లుక్‌ ని కూడా పరిచయం చేసి మెస్మరైజ్ చేశాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.  తమన్ సంగీతం ‌అందిస్తున్నాడు.

అయితే రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో పవన్ ఫస్ట్ లుక్ పై సెటైర్లు వేశారు. పవన్ లాగే వర్మ కూడా కుర్చీలో కూర్చొని ఉన్న స్టిల్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి డైరెక్టర్ సాబ్ .. తాను కొంతమంది ఇడియట్స్ గురించి ఆలోచించను ఇడియట్ పనులు చేయనని పోస్ట్ చేశారు.

Latest Updates