వర్మ శాపం : వెన్నుపోటు డైరెక్టర్ కు ఓటమి తథ్యం

లక్ష్మీస్ఎన్టీఆర్ మూవీ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్లో మరోసారి రెచ్చిపోయారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.  లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ను ఏపీ హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో తెరవెనుక తన సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకున్న ఆ వెన్నుపోటు డైరెక్టర్ ఎవరో ఈ ఎన్నికల్లో ఓడిపోవాలంటూ వర్మ ట్వీట్ చేశారు.

‘ ప్రప్రధమంగా తెలుగు ప్రజలను విడగొట్టిన ఘనత దురదృష్టవశాత్తు లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దక్కింది. కోర్ట్ ఆర్డర్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో తప్ప తెలంగాణలోనూ ఇంకా ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లందరూ సినిమా చూడొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేరు. హత విధి. తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన అతి గొప్ప తెలుగువాడి మరణానికి దారి తీసిన మానసిక క్షోభ తెలుగు వాళ్ళల్లో కొంత మందే చూస్తుంటే ఇంకా ఎందరో కేవలం ఎదురు చూసే పరిస్థితి కల్పించిన ఆ వెన్నుపోటుదారుడెవరో. సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్ కి నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలంలో నీళ్లు తీసి శపిస్తున్నాం..ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక .. తధాస్తు‘ అంటూ వర్మ ట్విట్ చేశారు.

Latest Updates