డ్రగ్స్ డీలర్లతో రియా వాట్సప్‌ చాటింగ్‌.. అరెస్టు చేసే అవకాశం

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణ కొనసాగుతోంది. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడిని సీబీఐ అధికారులు విచారించారు. ఆమె వాట్సప్‌ చాటింగ్‌పై కూడా అధికారులు దృష్టి పెట్టగా ఆమె  డ్రగ్స్ డీలర్లతోనూ మాట్లాడినట్లు తేలింది. డ్రగ్స్ డీలర్లతో ఆమె చేసిన చాటింగ్‌ సమాచారాన్ని ఈడీ అధికారులు సీబీఐ అధికారులకు ఇచ్చారు. డ్రగ్‌ డీలర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవ్‌ ఆర్యతో ఆమె సంప్రదింపులు జరిపింది. గౌరవ్‌తో 2017 మార్చి 8 నుంచి ఆమె చాటింగ్ చేస్తోంది. అత్యంత ప్రభావితం చేసే డ్రగ్స్ మిథిలీన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌ గురించి ఆమె ఆరా తీసింది.

డ్రగ్‌ డీలర్‌తో ఆమె జరిపిన చాటింగ్ బయటకు రావడంతో రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌ నుంచి రియా చక్రవర్తి డబ్బు తీసుకుందన్న ఆరోపణలు రావడంతో ఆమె బ్యాంకు ఖాతాపై ఈడీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో ఆమె డ్రగ్స్ డీలర్లతో జరిపిన చాటింగ్ గురించి ఈడీ సమాచారం సేకరించింది. ఇప్పటికే రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది.

Latest Updates