నేను అమాయ‌కురాల్ని నాకు ఏ పాపం తెలియ‌దు : 20పేజీల లేఖ‌లో రియా

డ్ర‌గ్స్ కేసులో అరెస్టైన రియా చ‌క్ర‌వ‌ర్తి బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే రియా బెయిల్ పిటిష‌న్ ను కోర్ట్ కొట్టివేసిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ బెయిల్ కోసం రియా 20పేజీల లేఖ రాసింది. ఆ లేఖ‌లో తాను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచార‌ణ‌లో భాగంగా త‌ప్ప‌ని స‌రిప‌రిస్థితుల్లో త‌ప్పు చేసిన‌ట్లు ఒప్పుకున్నానంటూ లేఖలో పేర్కొన్నారు.

ఆ లేఖ‌లో నేను అమాయ‌కురాల్ని. నేను ఎలాంటి డ్ర‌గ్స్ తీసుకోలేదు. ఒక‌వేళ నేను డ్ర‌గ్స్ తీసుకొని ఉంటే ఎన్సీబీ అధికారులు నా వ‌ద్ద డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకొనే వారు. కానీ ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎక్క‌డా చోటు చేసుకోలేదంటూ లేఖ రాసింది.

అంతేకాదు నేరాన్ని అంగీక‌రించాల‌ని కొంత‌మంది త‌న‌పై ఒత్త‌డి తెచ్చార‌ని అందుకే తాను నేరాన్ని అంగీక‌రించిన‌ట్లు లేఖ‌లో ప్ర‌స్తావించింది రియా. సెప్టెంబర్ 8 తాను ఎలాంటి నేరం చేయ‌లేదంటూ రియా వాదించిన విష‌యాన్ని లేఖ‌లో తెలిపింది.

మ‌రోవైపు రియా సోద‌రుడు షోయిక్ డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ చేసిన‌ట్లు ఒప్పుకున్నాడ‌ని టైమ్స్ నౌ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. టైమ్స్ నౌ క‌థ‌నం ప్ర‌కారం..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డ్ర‌గ్స్ కొనుగులో చేసిన విష‌యాన్ని నార్కోటిక్స్ అధికారుల విచార‌ణ‌లో వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది.

తాను డ్ర‌గ్స్ ను స‌ర‌ఫ‌రా చేస్తే..డ్ర‌గ్స్ సుశాంత్ తీసుకునేవార‌ని, డ‌బ్బులు మాత్రం త‌న సోద‌రి రియా చెల్లించిన‌ట్లు చెప్పాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటికి అనేక సార్లు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు ఒప్పుకున్న షోయిక్..ది శుద్ధ్ దేశీ రొమాన్స్ యాక్ట‌ర్ త‌న‌ను గంజాయిని అడిన‌ట్లు నార్కోటిక్ అధికారుల‌కు చెప్పాడు.

మార్చి నెల‌లో బసిత్ పరిహార్ తనను జైద్ విలాత్రాకు పరిచయం చేశాడని రియా సోదరుడు పేర్కొన్నాడు, ఆ తరువాత బాంద్రాలోని రెస్టారెంట్ లోప‌ల శామ్యూల్ మిరాండాకు డ్ర‌గ్స్ అందించిన‌ట్లు షోయిక్ ఒప్పుకున్న‌డాని టైమ్స్ నౌ త‌న క‌థ‌నంలో ప్ర‌స్తావించింది.

Latest Updates