బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మరియు డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్టయిన రియా చక్రవర్తి.. నార్కోటిక్స్ అధికారుల విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను తాకింది. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరియు ఫ్యాషన్ డిజైనర్ సిమ్మోన్ ఖంబట్టాలకు కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నట్లు రియా బాంబు పేల్చింది. ఈ ముగ్గురూ తనతో మరియు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని రియా తెలిపింది. వీరిలో ఒక హీరోయిన్ సుశాంత్‌కు స్నేహితురాలని, మరో ఇద్దరు తనకు స్నేహితులని రియా చెప్పినట్లు సమాచారం.

బాలీవుడ్ తారలలో 80 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని చెప్పి రియా అధికారులకు షాక్ ఇచ్చింది. రియా ఇచ్చిన సమాచారం మేరకు.. 25 మంది ప్రముఖ బాలీవుడ్ తారలను ఎన్‌సిబీ అధికారులు విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్‌సిబీ అధికారుల విచారణలో రియా.. సుశాంత్ కోసం డ్రగ్స్ సప్లై చేసినట్లు ఒప్పుకుంది. అంతేకాకుండా సుశాంత్ ఆర్థిక వ్యవహారాలు కూడా చూసేదని తెలిపింది. శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్ మరియు షోయిక్ చక్రవర్తిలకు డ్రగ్స్ మరియు ఆర్ధిక లావాదేవీల గురించి రియా సూచనలు చేసినట్లు తెలిపింది.

‘డ్రగ్స్ డెలివరీలను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సహాయకులు తీసుకునేవారు. ప్రతి డెలివరీ మరియు డబ్బుల చెల్లింపు రియా చక్రవర్తికి తెలిసే జరిగింది. డ్రగ్స్ సెలక్షన్ మరియు మనీ చెల్లింపులను రియానే కన్ఫర్మ్ చేసేది’ అని షోయిక్ ఎన్‌సిబీ అధికారుల విచారణలో తెలిపాడు.

ఇదిలావుండగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్, మరో నలుగురు నిందితుల బెయిల్ దరఖాస్తులను ముంబై స్పెషల్ కోర్టు శుక్రవారం తిరస్కరించిందని రియా తరపు లాయర్ సతీష్ మనేషిందే తెలిపారు. వచ్చే వారం బెయిల్ కోసం బొంబాయి హైకోర్టును సంప్రదిస్తామని ఆయన తెలిపారు.

For More News..

వీడియో: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ముందే కొట్టుకున్న పార్టీ లీడర్లు

వీడియో: నన్ను నా భర్తతో పాటే దహనం చేయండంటూ షాపింగ్ మాల్‌పై నుంచి దూకిన నవవధువు

తెలంగాణలో మరో 2,278 కరోనా కేసులు

Latest Updates