హాస్టల్ వార్డెన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అమ్మాయిలు

rice-bags-illegal-transport-in-hostel-at-hanamkonda

వరంగల్ జిల్లా హన్మకొండలోని ఎస్టీ గర్ల్స్ హాస్టల్ లో బియ్యం తరలిస్తుండగా అడ్డుకున్నారు విద్యార్ధినీలు. అర్థరాత్రి తర్వాత వర్కర్లతో కలిసి వార్డెన్ బియ్యం తరలిస్తుండగా విద్యార్ధినీలు చూశారు. బియ్యం ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించిన విద్యార్ధులను లోపలికి వెళ్లాలంటూ సిబ్బంది బెదిరించారు. దీంతో విద్యార్ధినీలు అంతా కలిసి ఆందోళన చేపట్టారు. హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో స్పందించిన అధికారులు.. హాస్టల్ ఘటనపై విచారణ ప్రారంభించారు.

Latest Updates