కూలీలు దొరుకుతలేరు: రైతులకు వరి కోత కష్టాలు

ఇక్కట్లు పడుతున్న అన్నదాతలు
రేటు పెంచిన కోత మెషిన్ల యజమానులు

గంటకు రూ.2,000 వసూలు

కూలీలకు రోజుకు
ఒక్కొక్కరికి రూ.300

కొన్ని ప్రాంతాల్లో కూలీలకు
ముందే అడ్వాన్సులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగుబోర్ల కింద సాగైన వరి ధాన్యం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తుండగా, ఆలస్యంగా నాట్లు పడిన పలు జిల్లాల్లో వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే ఎక్కడ చూసినా వరి కోత మెషిన్లు దొరక్క, కూలీలు రాక రైతులు కష్టాలు పడుతున్నారు. ఈ ఖరీఫ్ లో రాష్ట్రవ్యాప్తంగా 34 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఐదారు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

కోత మెషిన్లకు భారీ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ప్రస్తుతం కోతల సమయం నడుస్తుండటంతో మిషిన్లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగింది. దీంతో ధరలను ఒక్కసారిగా పెంచేశారు. గతంలో హర్వెస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెషిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యజమానులు గంటకు రూ.1,500 నుంచి రూ.1,600 వరకు వసూలు చేసేవారు. తాజాగా గంటకు రూ.2 వేలకు పెంచారు. ఒక్కసారిగా నాలుగైదు వందలు పెరగడంతో రైతులు ఆందోళలకు గురవుతున్నారు. ఎకరం పొలాన్ని కోయాలంటే గంటన్నర సమయం పడుతుంది. దీంతో ఎకరానికి రూ.3 వేలు కోయడానికే ఖర్చు అవుతోంది. అయినా మెషిన్లు దొరకడం కష్టమవుతోంది. ఒకే సారి కోతలు ప్రారంభం కావడంతో మిషిన్లు అందుబాటులో ఉండటం లేదు.

అడిగినంత ఇస్తామన్నా…

రైతులను కూలీల కొరత వేధిస్తోంది. అటు మెషిన్లు దొరక్క, చేతికొచ్చిన పంటను కోసే సమయంలో కూలీలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరికినా ఒక్కొక్కరికి రోజుకు రూ.300 ఇస్తేనే వస్తామని అంటున్నారు. గత ఏడాది కూలీ రోజుకు రూ.200 ఉండేది. ఈ సారి మరో 100 పెంచారు. ఆ మేరకు ఇస్తేనే వస్తామని తెగేసి చెబుతున్నరు. కొన్నిచోట్ల అడిగినంత ఇస్తామన్నా కూలీలు దొరుకుత లేరు. ఎకరం వరిని కోసేందుకు ఏడెనిమిది మంది కూలీలు అవసరమవుతారు. అయితే ఎకరానికి పది కూలిలు కట్టియ్యాలని కూలీలు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. దీంతో పంటపై వచ్చే లాభం కంటే కూలి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా అడ్వాన్స్లు ఇచ్చి..

కూలీలకు ఉన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో కొందరు రైతులు వారం పది రోజుల ముందే వారితో మాట్లాడుకుంటున్నరు. కొన్ని ప్రాంతాల్లో రైతులు కూలీలకు ముందుగానే అడ్వాన్స్​లు ఇస్తున్నారు. చుట్టుపక్కల ఊర్లలోకి వెళ్లి వారితో ఒప్పందం చేసుకుంటున్నారు. కూలీలు కూడా ఏ ఊర్లో డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్తున్నారు. దీంతో స్థానిక రైతులకు కూలీలు దొరకడం లేదు. రూ.300 వరకు ఇస్తామన్నా సొంత గ్రామాల్లో కూలీలు దొరక్కపోవడంతో ఆటోలు పెట్టి వేరే ఊర్లకు వెళ్లి తీసుకొచ్చుకుంటున్నామని రైతులు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates