మిల్లులో ధాన్యం కోత పెడితే మాకు చెప్పండి

మిల్లర్లు ధాన్యం కొనుగోలులో కోత పెడితే మాకు చెప్పండని కరీంనగర్ జిల్లా రైసు మిల్లుల సంఘం అధ్యక్షుడు బచ్చు భాస్కర్ అన్నారు. ఆయన ఈ రోజు జమ్మికుంటలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రైస్ మిల్లర్లకు, రైతుకు ఎలాంటి సంబంధం లేకుండా కొనుగోలు చేస్తున్నాం. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత మిల్లులో కటింగ్ చేయడంలేదు. రైతులు బాగుంటేనే రైస్ మిల్లులు బాగుంటాయి. రైస్ మిల్లర్లకు, మంత్రులకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. మిల్లులోకి వచ్చాక ఎక్కడైనా తూకంలో కొత కొస్తే మా దృష్టికి తీసుకురండి. అలాంటి మిల్లులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే మిల్లును సీజ్ కూడా చేస్తాం. కాంటా జరిగే దగ్గర రశీదు ఇస్తున్నాం’అని ఆయన తెలిపారు. ప్రతి విషయానికి మంత్రి ఈటల రాజేందర్ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

Latest Updates