
పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని ప్రతి తల్లిదండ్రులు భావిస్తుంటారు. వారు తిన్నా.. తినకపోయినా పిల్లల చదువు కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. ప్రీ ప్రైమరీ నుంచే స్కూళ్లు ఖర్చు అంతా ఇంతా కాదు. మంచి స్కూలూ.. మంచి ఫ్యాకల్టీ ఉందంటే.. ఆ స్కూల్లో పిల్లలను చేర్చేందుకు ఎగపబడుతుంటారు. ఇలాంటి రోజుల్లో చైనాలో ఓ ధనవంతుడు తన పిల్లాడి చదువుకోసం.. ఏకంగా పాఠశాలనే ఇంటికి తీసుకొచ్చాడు.
ప్రీ స్కూల్‌కు రూ.7 కోట్లు
ప్రపంచమంతా పిల్లల చదువు, పెంపకం ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏటా కనీసం 10 శాతం అధికమవుతున్నాయి. తల్లిదండ్రులకు రూ.లక్షల్లో జీతం ఉంటే తప్ప పెద్ద ఎడ్యుకేషన్ఇన్స్టిట్యూట్లలో చదవలేని పరిస్థితి ఉంది. కాని చైనాలో మూడేళ్ల పిల్లాడు చదువుకొనేందుకు ఏకంగా పాఠశాలనే స్థాపించాడు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న .. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. ధనవంతుల ఇళ్లల్లో జన్మిస్తే ఇంట్లోనే అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు. చైనాలో ఒక వ్యక్తి తన పిల్లల ప్రీ స్కూలింగ్ కోసం 7 కోట్ల రూపాయిలు ఖర్చు చేశాడు.
రూ. 7 కోట్లతో కిండర్ గార్టెన్
చైనా సోషల్ మీడియాలో ఈ స్టోరీ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మూడేళ్ల బిడ్డను కిండర్ గార్టెన్‌లో చేర్పించేముందు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ వ్యక్తి 20-30 లక్షల్లో కాకుండా ఏకంగా 7 కోట్లకు పైగా ఖర్చుతో పాఠశాలను నిర్మించాడు. అది కూడా చిన్న పిల్లలకు మాత్రమే. తన కొడుకు ఇక్కడే చదువుకోవాలని.. మంచి వాతావరణంలో జీవించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైనా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సౌత్ చైనా మార్నింగ్ వివరాల ప్రకారం వ్యక్తి ఇంటిపేరు లీ .. అతను జియాంగ్షు ప్రావిన్స్‌లో నివసిస్తున్నాడు. తన 3 ఏళ్ల కొడుకును కిండర్ గార్టెన్‌లో చేర్చే ముందు ప్రీ-స్కూల్‌ను 87 వేల డాలర్లు ( రూ. 7 కోట్ల 11 లక్షలు) పెట్టుబడి పెట్టి కేవలం 7 నెలల్లో పాఠశాల భవనాన్ని పూర్తి చేశారు.
పాఠశాల ప్రత్యేకతలు
పాఠశాలలో ప్రత్యేకంగా డ్రాయింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాలు , కార్టూన్ల కోసం కూడా ప్రత్యేకంగా క్లాస్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. ఒక అంతస్థు నుండి మరొక అంతస్తుకి వెళ్లేందుకు స్లయిడ్లు కూడా ఉన్నాయి. ఈ పాఠశాలలో అండర్‌ఫ్లోర్ హీటింగ్ సిస్టమ్‌తో పాటు పెద్ద ట్యూబ్ స్లైడ్ ఉంది. పాఠశాలలో కదులుతున్న తెర గోడలు, పెద్ద కిటికీలు ఉన్నాయి. డ్యాన్స్ నేర్చుకొనేందుకు ప్రత్యేక గదులు, లైబ్రరీ, ఉద్యానవనం, పండ్ల చెట్లు , రంగురంగుల టాయిలెట్లు కూడా ఈ పాఠశాలలో ఉన్నాయి. లీ కొడుకుతో పాటు మరికొందరు పిల్లలు పాఠశాలలో ఉన్నారు. వారు ఇక్కడ నెలకు 47 వేలు ఫీజు చెల్లిస్తారు. ఈ స్టోరీ తెలియగానే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చాయి.