సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు: ముఖేశ్ అంబానీ

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు ప్రారంభిస్తామన్నారు  రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ. జియో ఫైబర్ ప్లాన్ నెలకు 700 రూపాయలతో ప్రారంభమవుతుందని చెప్పారు. 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్లకు చేర్చాలన్న ప్రధాని లక్ష్యానికి పూర్తిగా మద్దతిస్తానని తెలిపారు. రిలయన్స్ 42వ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన.. జియో గిగా ఫైబర్ సేవల్లో భాగంగా జియో 4కె డీటీహెచ్ సెట్ టాప్ బాక్స్ టీవీ, ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్ సేవలను ఒకే ప్లాన్ కింద అందిస్తామని చెప్పారు. 16 వందల టౌన్లలోని 2 కోట్ల నివాసాలు, 1.5 కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్ ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖేశ్ వివరించారు.

Latest Updates