ధోని రికార్డును బ్రేక్ చేసిన పంత్

ధోని స్థానంలో వికెట్ కీపర్ గా చోటు దక్కించుకున్న రిషబ్ పంత్  తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకుంటున్నాడు. లేటెస్ట్ గా వెస్టిండిస్ తో జరుగుతున్న రెండో టెస్టులో మిస్టర్ కూల్ ధోని రికార్డ్ ను బద్దలు కొట్టాడు పంత్. టెస్టుల్లో ధోని 15 మ్యాచ్ ల్లో 50 మందిని ఔట్ చేయగా.. ఆ రికార్డ్ ను పంత్ 11 మ్యాచుల్లోనే చేధించాడు. తన కెరీర్ లో 11వ టెస్టు ఆడుతున్నపంత్.. ఇషాంత్ బౌలింగ్ లో వెస్టిండీస్ బ్యాట్స్ మన్  క్రెయిగ్ బ్రాత్ వైట్  ఇచ్చిన క్యాచ్ పట్టుకుని.. తక్కువ సమయంలోనే 50 మందిని ఔట్ చేసిన భారత క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు.

 

Latest Updates