బ్రేకింగ్: బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రిషి కపూర్ ఇకలేరు

ముంబై: బాలీవుడ్ సీనియర్ యాక్టర్, స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ (67) గురువారం చనిపోయారు. ముంబైలోని సర్ హెన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. ఈ వార్తను రిషి సోదరుడు రణ్ ధీర్ కపూర్ కన్ఫమ్ చేశారు. ‘ఆయన చనిపోయారు..? రిషి కపూర్ చనిపోయారు’ అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. 2018లో రిషి కపూర్ కు క్యాన్సర్ ఉందని తేలింది. క్యాన్సర్ ట్రీట్ మెంట్ తర్వాత గతేడాది సెప్టెంబర్ లో ఆయన న్యూయార్క్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి వెళ్లిన రిషికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడంతో అక్కడే ఆస్పత్రిలో చేర్చారు. చివరగా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ‘ది బాడీ’ అనే వెబ్ సిరీస్ లో రిషి నటించాడు. ఒక సినిమా కోసం ఢిల్లీలో ఈ ఏడాది మొదట్లో షూటింగ్ లోనూ పాల్గొన్నాడు. నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్ కపూర్ రెండో కొడుకు అయిన రిషి కపూర్.. మేరా నామ్ జోకర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు నటించాడు. ఈ ఫిల్మ్ లో అద్భుత నటనకు గాను నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత 1973లో హీరోగా బాబీ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హోదా సంపాదించాడు. అమర్ అక్బర్ ఆంటోనీ, లలియా మంజూ, రఫూ చక్కర్, సర్గమ్, కర్జ్, బోల్ రాధా బోల్ సినిమాల్లో నటించి అలరించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కపూర్ అండ్ సన్స్, డీ–డే, ముల్క్ తోపాటు అమితాబ్ తో కలసి నటించిన  102 నాటౌట్ మూవీస్ లో వైవిధ్యమైన యాక్టింగ్ తో ఈతరం ఆడియన్స్ నూ ఆకట్టుకున్నాడు. రిషి కపూర్ భార్య పేరు నీతూ కపూర్.

Latest Updates