ఏపీలో కొత్తగా 10,794 కేసులు..70 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. వరుసగా 11వ రోజు 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 10,794 కరోనా కేసులు నమోదుకాగా.. వైరస్ తో 70 మంది చనిపోయారని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో 4,98,125కు కరోనా కేసులు చేరగా..  ఇప్పటివరకు రాష్ట్రంలో 4,417 మరణాలు సంభవించాయని చెప్పింది. ప్రస్తుతం 99,689 యాక్టివ్ కేసులున్నాయని.. కరోనా నుంచి కోలుకుని 3,94,019 మంది రికవరీ అయ్యారని తెలిపింది. ఇప్పటివరకు 41,07,890 కరోనా టెస్టులు నిర్వహించామని తెలిపింది వైద్యారోగ్యశాఖ.

.

Latest Updates