పెరుగుతున్న బంగారం ధరలు 

  • 35 వేల దిశగా పరుగులు

బంగారం ధరలు.. భగ్గుమంటున్నాయి. 35 వేల మార్క్ దిశగా పరుగులు పెడుతూ.. కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే బంగారం ధర ఆల్ టైం హై కి చేరుకోబోతుంది. మరి పసిడి పరుగులకు ఇప్పట్లో బ్రేకులు పడవా? 36, 37 వేల మార్క్ ను టచ్ చేస్తుందన్న నిపుణుల మాటల్లో వాస్తవమెంత?

బంగారం ధర.. ఆల్ టైం హై దిశగా పరుగులు పెడుతుంది. దేశీయ మార్కెట్ లో.. సహజంగా 30 వేలకు అటు ఇటూగానే ధరలు ఊగిసలాడుతుంటాయి. కానీ 2016 లో మార్కెట్ చరిత్రలోనే 35 వేల మార్క్ ను టచ్ చేసి.. అతితక్కువ రోజుల్లోనే మళ్లీ రివర్స్ గేర్ లో పరుగు పెట్టింది. ఇప్పుడు మళ్లీ 35 వేలను టచ్ చేయబోతుంది. గత నెలలో ప్రారంభమైన పసిడి పరుగులు… ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.

బంగారం ధరలను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. గత కొన్ని రోజులుగా.. మార్కెట్ స్టేబుల్ గా లేకపోవడంతో.. ఇన్వెస్టర్స్ అంతా మెటల్ వైపు చూస్తున్నారు. యెల్లో మెటల్ పై ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. దీనికి తోడు.. పెళ్లిళ్ళ సీజన్ కారణంగా డొమస్టిక్ మార్కెట్లో గోల్డ్ కు డిమాండ్ పెరిగింది. ఇక ఇప్పుడు యుధ్దం వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్న వార్తలు కూడా.. బంగారం పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. కారణాలేవైనా.. బంగారం మాత్రం సామాన్యులకి అందనంత దూరంగా వెళ్లిపోతుంది.

గోల్డ్ ప్రైజ్ ఇప్పట్లో తగ్గే అవకాశాలే కనిపంచడం లేదంటున్నారు గోల్డ్ వ్యాపారులు. ఇటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 12 వందల 70 డాలర్లకు అటు ఇటుగా ఊగిసలాడుతుంది. కానీ ప్రస్తుతం 13 వందల 40 డాలర్లకు చేరింది. మరో నెల రోజుల్లో 14 వందల డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజంగా అదే జరిగితే.. దేశీయ మార్కెట్ లో తులం బంగారం 36 వేలను టచ్ చేస్తుంది. అలా పెరుగుతూ.. 37 వేలను టచ్ చేసినా.. ఆశ్యర్చపోనవసరం లేదంటున్నారు గోల్డ్ ఎక్స్ పర్ట్స్.

ఇక పెరుగుతున్న ధరలకు.. పుత్తడి ప్రియులు పరేషాన్ అవుతున్నారు. ధర ఎప్పుడు తగ్గుతుందా…  కొందామని ఎదురు చూస్తున్నారు గోల్డ్ లవర్స్. కానీ.. ధరలు తగ్గకపోవడంతో.. అవసరాల మేరకు ఉన్నంతలో కొనుగోలు చేస్తున్నారు. పెళ్లి కోసం ఎంత అవసరమో అంతా కొనుగోలు చేసి.. తగ్గిన తరువాత కొందామన్న ధోరణిలో ఉన్నారు.

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో.. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 34 వేల 8 వందల 65 రూపాయిల దగ్గర ట్రేడ్ అయ్యింది. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం.. 32 వేల 3 వందల రూపాయలుగా ఉంది. ఇక సిల్వర్ కూడా.. పుత్తడితో పోటీ పడుతుంది. నిన్నటి కంటే వందరూపాయిలు పెరిగి 43 వేల 6 వందల రూపాయిల దగ్గర  ట్రేడ్ అవుతుంది.

నిజంగా 36… 37 వేలను టచ్ చేస్తే బంగారం కొనడం సామాన్యులకి కలగానే మిగిలిపోతుంది. బంగారం ధర మీదే.. ఆర్నమెంట్ కు చెందిన వేస్టేజ్, మేకింగ్ చార్జీలు ఆధారపడి ఉండడంతో బంగారం కొనుగోలుకు సామాన్యులు వెనకడుగు వేస్తున్నారు.

ఇన్వెస్టర్లు యెల్లో మెటల్ ను సేఫెస్ట్ ఇన్వెస్టమెంట్ గా భావిస్తున్నారు.  డొమస్టిక్ మార్కెట్లో డిమాండ్ పెరగడం, ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగుతాయన్న వార్తల కారణంగా.. మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. నా అంచనాల ప్రకారం.. 37 వేల మార్క్ ను టచ్ చేస్తుంది. వారం రోజుల లోపే.. ఆల్ టైం హైకి బంగారం ధరలు చేరుకోబోతున్నాయి. ధరలు సామాన్యులకి అందుబాటులో లేక.. సేల్స్ తగ్గుముఖం పడుతున్నాయి.

మరో నెల రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్సు ధర 14 వందల డాలర్ల కు చేరే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే దేశీయ మార్కెట్లో  36 వేల రూపాయిలకు బంగారం ధర చేరుతుంది. ఇప్పట్లో  ధర తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. మధ్య, దిగువ తరగతి వారు కొనడానికి ఇబ్బంది పడుతున్నారు.

Latest Updates