బాలీవుడ్ హీరోకు రూ 4.70 కోట్ల రైతు రుణమాఫీ?

బాలీవుడ్ హీరో, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేశ దేశ్ ముఖ్  రైతు రుణమాఫీ పొందారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రితేశ్ దేశ్ ముఖ్ అతని సోదరుడు అమిత్ దేశ్ ముఖ్ రూ.4 కోట్ల 70 లక్షల  లోన్  తీసుకున్నారని..అది రైతు రుణమాఫీ కింద మాఫీ అయినట్లు  కొన్ని డాక్యుమెంట్స్ ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై స్పందించిన రితేశ్ దేశ్ ముఖ్ తాను తన సోదరుడు అమిత్ దేశ్ ముఖ్ ఎటువంటి లోన్ తీసుకోలేదని..అలాంటపుడు రుణమాఫీ ఎలా పొందుతామన్నారు. ఆ డాక్యుమెంట్స్  నిజం కాదని..మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్లో బదులిచ్చారు.

అయితే రితేశ్ దేశ్ ముఖ్ స్పందన తర్వాత డాక్యుమెంట్స్ పోస్ట్ చేేసిన మధు పూర్ణిమ కిశ్వర్ అనే మహిళ  ఆ పోస్ట్ ను డిలేట్ చేసింది. తాను పొరపాటు పడ్డానని తన ఫ్రెండ్ తనకు లింక్ చేస్తే పోస్ట్ చేశానని .. తనను క్షమించాలని కోరింది . నా తప్పును గుర్తించినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇలాంటి తప్పులు మళ్లీ చేయబోనని ట్వీట్ చేసింది ఆ మహిళ.

Latest Updates