రియా బెయిల్ పిటిషన్ మరోసారి తిరస్కరించిన ముంబై కోర్టు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మరియు డ్రగ్స్ ఆరోపణలతో అరెస్టు అయిన రియా చక్రవర్తికి మంబై కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆమెతో పాటు.. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి మరియు ఇతర నిందితుల బెయిల్ అభ్యర్థనలను కూడా కోర్టు తిరస్కరించింది. దాంతో రియా చక్రవర్తి సెప్టెంబర్ 22 వరకు జైలులోనే ఉండనున్నారు.

గతంలో రియా బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో.. తాజాగా మరో కొత్త బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అందులో తాను గతంలో కొంతమంది బలవంతం మీద తప్పులను ఒప్పుకున్నానని తెలిపింది. జ్యుడీషియల్ కస్టడీలో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆమె తెలిపింది. తనకు అత్యాచారం మరియు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఎటువంటి నేరం చేయలేదని.. ఈ కేసులో తప్పుగా చిక్కుకున్నాని రియా పిటిషన్‌లో పేర్కొంది. ఇప్పటికే రియా చక్రవర్తి ముంబైలోని బైకుల్లా మహిళా జైలులో రెండు రాత్రులు గడిపారు.

For More News..

అమ్ముకున్నోళ్లు బాగానే ఉన్నరు.. కొనుకున్నోళ్లే కష్టాలు పడుతున్నరు

నాకు నష్టపరిహారం ఇప్పించండి: కంగనా రనౌత్

సెమీ ఫైనల్లో ఓడి.. రికార్డును చేజార్చుకున్న సెరెనా విలియమ్స్

Latest Updates