ఆర్‌జే హేమంత్ కారుకు ప్రమాదం

rj-hemant-is-a-car-accident

ప్రముఖ రేడియో జాకీ, టీవీ యాంకర్, నటుడు హేమంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హేమంత్ క్షేమంగా బయటపడ్డాడు. కృష్ణా జిల్లా  జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌ పేట క్రాస్‌ రోడ్డు దగ్గర హేమంత్‌ కారు ఓ గేదెను ఢీ  కొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది.

విజయవాడలో ‘మహర్షి’ సక్సెస్‌ మీట్‌ కార్యక్రమం పూర్తి చేసుకుని హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ప్రమాద సమయంలో హేమంత్ స్వయంగా కారును డ్రైవ్ చేస్తున్నట్లు సమాచారం.

Latest Updates