6 బుల్లెట్లు దిగినా.. కూతురిని పరీక్షకు తీసుకెళ్లాడు

పాట్నా : తాను చావుబతుకుతో కొట్టుమిట్టాడుతున్నా..కూతురి భవిష్యత్తు నాశనం కావద్దనుకున్నాడు ఓ తండ్రి. తుపాకీ బుల్లెట్ల గాయంతోనే కూతురిని పరీక్ష సెంటర్‌ కు తీసుకెళ్లాడు. ఈ సంఘటన బీహార్ లో జరిగింది. బెగుసారయి జిల్లాకు చెందిన రాష్ట్రీయ జనతా దళ్‌ నాయకుడు, మాజీ సర్పంచ్‌ రామ్‌ కృపాల్‌ మహతో తన కూతురిని పరీక్ష సెంటర్‌ కు బైక్‌పై తీసుకెళ్తున్నాడు. ఆరుగురు దుండగులు రామ్‌ కృపాల్‌ పై తుపాకీతో కాల్పులు జరిపారు. 6 బుల్లెట్లు శరీరంలోకి దిగడంతో రామ్‌ కృపాల్‌ కు తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ.. కూతురుని ఎగ్జామ్‌ సెంటర్‌ దగ్గరకి తీసుకెళ్లాడు. తర్వాత హస్పిటల్ లో చేరాడు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు డాక్టర్లు.

పాత కక్షల వల్లే రామ్‌ కృపాల్‌ పై కాల్పులు జరిపారని తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నొప్పితో బాధపడుతూ కూడా కూతురినీ సమయానికి ఎగ్జామ్ సెంటర్ కి తీసుకొచ్చాడని తెలిపారు పోలీసులు.

Latest Updates