ట్రాక్టర్ ను ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి

జోగులాంబ  గద్వాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గద్వాల మండలం అనంతపురం దయ్యాల వాగు దగ్గర 44 నంబర్ జాతీయ రహదారిపై… ఆగి ఉన్న చెరుకు ట్రాక్టర్ ను కారు ఢీ కొట్టింది. స్పాట్ లోనే కిరణ్, విజ్జు, సునీల్ చనిపోయారు.

డ్రైవింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు తీవ్ర గాయాలు కావడంతో గద్వాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ వెళ్తున్న మిత్రున్ని గద్వాల నుంచి ఎర్రవల్లి చౌరస్తా వరకు దిగబెట్టే క్రమంలో ప్రమాదం జరిగింది.  కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ముగ్గురి మృతదేహాలు కార్లోనే చిక్కుకుపోవడంతో క్రేన్ సహాయంతో బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం తరలించారు.

see also: ఇదే నా మొదటి ప్రేమలేఖ..

‘నారప్ప’ రచ్చ : మా వాళ్లే రియల్‌‌ హీరోలు..!

తొలి కోటీశ్వరి : దివ్యాంగురాలిని వరించిన అదృష్టం

Latest Updates