TSPA జంక్షన్ లో వాహనం ఢీ : ఇద్దరు కూలీలు దుర్మరణం

సైబరాబాద్ : నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ స్టేట్ పోలీస్ ఎకాడమీ జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు కూలీలు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Latest Updates