తార్నాకలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లోని తార్నాక డిగ్రీ కళాశాల వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను నవీన్‌(50), సోమరాజు(32)గా గుర్తించారు. గ్యాస్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Latest Updates