కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి స్టేజి దగ్గర ఓ కారును లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  మృతులంతా గుంటూరు జిల్లా సత్తెనపల్లి వాసులు. కారులో హైదరాబాద్ నుంచి బాసర వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. కారు నంబర్ TS08 EB1445 గా గుర్తించారు. ఈ ఘటనకు కారణమైన లారీ.. డీజిల్ ట్యాంకర్ పేలి అగ్నికి ఆహుతైంది.

Latest Updates