కొండగట్టులో స్వాములపైకి దూసుకెళ్లిన లారీ : ఇద్దరు మృతి

జగిత్యాల: కొడిమ్యాల మండలం పూడూరు దగ్గర ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్వాములు మృతి చెందారు. మృతులను పొన్నం అరుణ్, పులి రాజేందర్ గా గుర్తించారు. వీరి సొంతఊరు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం. ఈ ఇద్దరిలో అరుణ్ స్పాట్ లోనే చనిపోయాడు. రాజేందర్ కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రాణం వదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates