నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని తీగల వాగు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆంధ్రకు చెందిన ఇద్దరు యువకులు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. వర్షకోండ వైపు నుండి వస్తున్న కారుని సేంద్రియ ఎరువు లారీ ఢికొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లారీని క్రేన్ ల సహయంతో కారు నుంచి విడదీశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు గత 20 సంవత్సరాలుగా తాళ్ల రాంపూర్ లో నివసిస్తున్న ఆంధ్రకు చెందిన వారు. ఇక్కడ మూల మలుపు ఎక్కువగా ఉండడంతో గతంలో ఇదే ప్రాంతంలో ఇప్పటివరకు మూడు ప్రమాదాలు జరిగాయి. అక్కడికక్కడే మృతి దాఖలాలూ ఉన్నాయి. స్థానికులు ఈ ప్రాంతంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు

Latest Updates