
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హిమాయత్‌సాగర్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు.