ORR వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరు జర్నలిస్టులు మృతి

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతీ కారు లారీని ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం  కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు జర్నలిస్టులు దిలీప్ ఠాకూర్ సింగ్,  ప్రవీణ్ సింగ్  గుర్తించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Latest Updates