శ్రీశైలం ఘాట్‌లో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ఇద్దరు మహిళల మృతి

శ్రీశైలం ఘాట్ రోడ్డులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదుగా ఢీకొట్టుకొన్నాయి. ప్రమాదం స్థలంలోనే ఇద్దరు మహిళలు మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగింది.

ఇష్టకామేశ్వరి గేటు సమీపంలో రాజమండ్రి ధర్మవరం డిపోల బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. బస్సులు వేగంగా గుద్దుకోవడంతో ఇద్దరు ప్రయాణికులు స్పాట్‌లోనే చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో సున్నిపెంటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతుల్లో ఒకరు శ్రీశైలం వాసి పుణ్యవతిగా గుర్తించారు. ఆమె భర్త నారాయణ రెడ్డికి తీవ్రంగా గాయలు కావడంతో కోమాలో వెళ్లినట్లు తెలిసింది. మరో మృతురాలు తమిళనాడు వాసి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates