లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఒకరు మృతి

ఆగి ఉన్న లారీని ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో జరిగింది. మండలంలోని మొద్దుల చెరువు స్టేజ్ వద్ద లారీని విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న  ప్రయివేటు బస్సు ఢికొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మందికి పైగా ప్రయాణికులున్నారు.

Latest Updates