తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి

road-accident-in-tamilnadu-seven-people-died

తమిళనాడు: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై- బెంగుళూరు జాతీయ రహదారిపై వేంగిలి సమీపంలో కారు, లారీని ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు.  కారు టైర్ పేలి ముందు వెళుతున్న కంటైనర్ లారీని బలంగా ఢీ కొట్టడంతో… ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మృతి చెందిన వారు మహారాష్ట్ర  పుల్ సాగల్  రైల్వేలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దేశ్ ముఖ్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన దేశ్ ముఖ్.. తన కుటుంబ సభ్యులతో కలిసి వేలూరులోని  గోల్డెన్ టెంపుల్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో  ప్రమాద స్థలానికి చేరుకున్న ఆంబూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates