తిమ్మాపూర్ వద్ద లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ  బస్సు  ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి.  20 మంది ప్రయాణికులతో వనపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు తిమ్మాపూర్ వద్దకు రాగానే సడెన్ గా ఆగిన లారీని ఢీ కొట్టింది.  గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వెయ్యడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

see more news

జియో ఫైబర్ మేనేజ్ మెంట్ పై ఎల్బీ నగర్లో కేసు

ఐదు రోజుల్లో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ కట్టిన్రు

క్లిక్ చేస్తే చాలు.. అకౌంట్లోకి డబ్బులు!

Latest Updates