ములుగు జిల్లాలో వ‌ర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు.. ప్ర‌జ‌ల అవ‌స్థ‌లు

ములుగు జిల్లా: రాష్ట్రంలో ప‌లుచోట్ల ఆదివారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షాల‌కు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోవ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని బీరెల్లి బయ్యారం డబుల్ రోడ్డు కల్వర్టు అంకంపల్లి వద్ద రాత్రి కురిసిన వర్షానికి కొట్టుకు పోయింది. దీంతో రాక పోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు వెంట‌నే స్పందించి రోడ్డు వేయాల‌ని కోరుకుంటున్నారు స్థానికులు.

Latest Updates