మూసాపేట మెట్రో పిల్లర్ చుట్టూ కుంగిన రోడ్డు

గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌ నగరం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల ధాటికి మూసాపేట మెట్రో స్టేషన్‌ కింద ప్రధాన రహదారి కుంగింది. మెట్రో పిల్లర్ల చుట్టూ భూమి కుంగి గుంతల్లోకి నీరు చేరింది. దీంతో అలర్టైన GHMC  సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని తోడిపోశారు. రోడ్డుపై వెళ్లే వాహదారులకు ఇబ్బందులు లేకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రమాదం జరిగే అవకాశముంటుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates