తెలంగాణలో కొబ్బరి పీచుతో రోడ్లు

ప్రతిపాదనకు కేంద్రం ఓకే

న్యూఢిల్లీ,వెలుగు: గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కొబ్బరి పీచును ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లోని 121 కిలోమీటర్ల రహదారిని కాయిర్ జియో టెక్స్ టైల్స్ సాయంతో నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బుధవారం అధికారులు మీడియాకి వెల్లడించారు. తెలంగాణ, ఏపీతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో మొత్తం 1, 674 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణానికి కాయిర్ జియో టెక్స్ టైల్స్ ని వాడనున్నట్టు తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) -3 కింద నిర్మించే గ్రామీణ రహదారుల్లో 5 శాతాన్ని కాయిర్ జియో టెక్స్​టైల్​ను ఉపయోగించి నిర్మించనున్నారు.

For More News..

సిటీ బస్సుల కోసం పబ్లిక్ ఎదురుచూపులు

ఓపెనింగ్‌కు సిద్ధంగా కేబుల్ బ్రిడ్జి

సిమ్ బ్లాక్ అయితదంటూ స్కూల్ టీచర్ కు ఫోన్ చేసి..

Latest Updates